ఆ 5 గ్రామాల విలీనంపై చంద్రబాబుకు లేఖ రాస్తా

 

MLC Kalvakuntla Kavitha

  • జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ కవిత
  • భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై దాడికి ఖండన
  • గ్రామాల విలీనానికి తుమ్మల చొరవ చూపాలని విజ్ఞప్తి

భద్రాచలం చుట్టు పక్కల వున్న 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రామాలయ భూముల వ్యవహారంలో ఆలయ ఈఓ, బీసీ బిడ్డ రమాదేవిపై పురుషోత్త పట్నం గ్రామస్తులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఆమె, ఆ 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు వెంటనే అవసరమైన చర్యలను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చొరవ చూపాలని కోరారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు వచ్చిన కవిత, కొత్తగూడెంలో జరిగిన తెలంగాణ జాగృతి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. భద్రాచలం చుట్టు ప్రక్కల వున్న 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తూ జాగృతి ఆధ్వర్యంలో ఒక రౌడ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించామన్నారు. ఫలితంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు, మంత్రి తుమ్మల వినతి పత్రం ఇచ్చారని కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు. రానున్న కాలంలో ఈ అంశంపై జాగృతి ఆద్వర్యంలో అవసరమైన పోరాటాలు సాగిస్తామని చెప్పారు.

42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు జీవో విడుదల చేయాలి  

బెసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ తక్షణమే జీవో విడుదల చేయాదని కవిత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర క్యాబినేట్ మీటింగులో ఒక నిర్ణయం తెసుకోవాలన్నారు. రిజర్వేషన్లు అమలు చేసే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే, సహించేది లేదని హెచ్చరించారు. వికారాబాద్ డిక్లరేషన్ కు కట్టుబడి తక్షణమే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఆమె కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేశారు. రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు అసెంబ్లీలో పాసైనా, అమలకు జీవో విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. అందుకే బీసీ రిజర్వేషన్ల సాధనకు ఈ నెల 17న రైల్ రోఖో జరప తల పెట్టామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు ఈ రైల్ రోఖోలో పాల్గొని విజయ వంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇస్తా ఇస్తా అంటాడు ఏమీ ఇవ్వడు ... వస్తా వస్తా అంటాడు చర్చకు రాడు

ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని కవిత విమర్శించారు. ఇప్పటికీ రైతులకు రుణ మాఫీ సంపూర్ణంగా జరగలేదన్నారు. పెన్షన్లను 2 నుండి 4 వేలకు పెంచ లేదని, ఆడ బిడ్డలకు తులం బంగారం ఇవ్వ లేదని అన్నారు. రేవంత్ రెడ్డి ఇస్తా ఇస్తా అంటాడు ఏదీ ఇవ్వడని, వస్తా వస్తా అంటాడు చర్చకు రాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధి పట్ల, ప్రజల సమస్యల పరిష్కారం పట్ల రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదన్నారు. ఆయన నోటి నుండి ఒక్క సారి కూడా జై తెలంగాణ అన్న మాట రాలేదని, జై కాంగ్రెస్, జై సోనియమ్మ జపం చేయడంలోనే మునిగి తేలుతున్నారని దుయ్య బట్టారు. కేసీఆర్ పదేళ్ళ పాలనలో ప్రజలు దేనికీ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరమే రాలేదన్నారు. ఇప్పుడు యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టు కోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అసలు వ్యయసాయమంటేనే రైతులు బయపడే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంగరేణిని ప్రైవేటీకరిస్తే ఊరుకొనేది లేదు

సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేస్తే, ఊరుకొనేది లేదని కవిత హెచ్చరించారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించక పోగా, గనుల ప్రైవేటీకరణకు పూనుకుంటున్నాయని ఆరోపించారు. సింగరేణిలో అవినీతి పేరుకు పోయిందని, అన్ని స్థాయిల్లో అవినీతి రాజ్యామెళుతోందన్నారు. అలాగే, భూర్గంపాడులో ఐటీసీ కాలుష్య నివారణపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. పాల్వంచలో స్పాంజ్ ఐరన్ ను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. అనేక పరిశ్రమలు, భద్రాచల రామాలయం వున్న ఈ జిల్లాలో ఎయిర్ ఫోర్ట్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం వుందని, వెంటనే ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ అంశాలన్నిటిపై తాను శాసన మండలి సమావేశాల్లో మాట్లాడతానని చెప్పారు. ఈ సందర్భంగా నాయకులు వీరన్న, శంకర్ నాయక్ ఆధ్వర్యంలో పలువురు జాగృతిలో చేరారు. ఎమ్మెల్సీ కవిత వారికి కండువాలు కప్పి సాదరంగా సంస్థలోకి ఆహ్వానించారు. ముందుగా ఆమెకు గిరిజన సాంప్రదాయ పద్దతిలో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

MLC Kalvakuntla Kavitha

MLC Kalvakuntla Kavitha



Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి